రుచి చూచి ఎరిగితిని

ruchi chuuchi erigithini

🎵 TG-2834🌐 Telugu
పల్లవి

రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని || రుచి చూచి||

1వ చరణం

గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని

Report Error