రుచి చూచి యెరిగితిని - యెహోవా ఉత్తముడనియు
ruchi chuuchi yerigithini - yehoovaa uththamudaniyu
రుచి చూచి యెరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని
గొప్పదేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు - దయాళుడవు నీవే ||రుచి చూచి||
మహోన్నతుడగు దేవా - ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ - ఆశ్చర్య కార్యములన్ ||రుచి చూచి||
మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను - అతి సుందరుడవనియు ||రుచి చూచి||
నా జీవితమంతయును - యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా- దేవుని కీర్తింతున్ ||రుచి చూచి||
సంతోషించెద నెల్లపుడు - కష్ట ధు:ఖ భాధలలో ఎంతో నెమ్మది నిచ్చు నా - రక్షకుడు నాయేసు ||రుచి చూచి||
ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిదిలో చేరి సంపూర్ణముగా పొందెదను - అడుగు వాటన్నిటిని ||రుచి చూచి||
కృతజ్నత చెల్లింతు - ప్రతి దాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను ||రుచి చూచి||