రుచి చూచి యెరిగితిని - యెహోవా ఉత్తముడనియు

ruchi chuuchi yerigitini - yehoovaa uttamuddaniyu

🎵 TG-1215💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని

1వ చరణం

గొప్పదేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు - దయాళుడవు నీవే

2వ చరణం

మహోన్నతుడగు దేవా - ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ - ఆశ్చర్య కార్యములన్‌

3వ చరణం

మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను - అతి సుందరుడవనియు

4వ చరణం

నా జీవితమంతయును - యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా- దేవుని కీర్తింతున్‌

5వ చరణం

సంతోషించెద నెల్లపుడు - కష్ట ధు:ఖ భాధలలో ఎంతో నెమ్మది నిచ్చు నా - రక్షకుడు నాయేసు

6వ చరణం

ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిదిలో చేరి సంపూర్ణముగా పొందెదను - అడుగు వాటన్నిటిని

7వ చరణం

కృతజ్నత చెల్లింతు - ప్రతి దాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను

Report Error