సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో

saagilapadi mrokkedamu sathyamuthoo aathmaloo

🎵 TG-2455🌐 Telugu
పల్లవి

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి||

1వ చరణం

మోషేకంటే శ్రేష్టుడు అన్ని మోసములనుండి విడిపించున్ వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము అహరోనుకంటే శ్రేష్టుడు మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము ఆలయముకన్న శ్రేష్టుడు నిజ ఆలయముగ తానే యుండెన్ ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రొక్కెదము యోనా కంటె శ్రేష్టుడు ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రొక్కెదము సొలోమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు పదివేలలో అతిప్రియుండు పదిలముగ మ్రొక్కెదము రాజులకంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్ రారాజుగ త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము

Report Error