సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన
sajeeva saakssulugaa mammu nilipina
🎵 TG-2021🌐 Telugu
పల్లవి
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము జిహ్వా ఫలము అర్పింతుము (2) మేమున్నాం నీ చిత్తములో మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ||
1వ చరణం
తల్లి గర్భమునందు – మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు కృంగిపోము మేమెన్నడు ఓటమి రాదు మాకెన్నడు ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం కలత చెందము మేమెన్నడు అలసట రాదు మాకెన్నడు