సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ
sameepinparaani theejassuloo oo.. oo
🎵 TG-2538🌐 Telugu
పల్లవి
సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ.. వసీయించువాడ నా దైవమా (2) రాజులకు రారాజా సమస్తమునకు జీవధారకుడా పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని||
1వ చరణం
పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు దూషకుడను హానికరుడైన నన్ను కరుణించి మార్చివేసితివి నా దేవా… నా యవ్వనమును బట్టి తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో నీ స్వరూపములోకి నను మార్చుము