సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను
sarvashaktuni stootragaanamu - salparee jagamellanu
పల్లవి
నిర్వహించును దాస భారము- నిత్యమెద రాజిల్లను
1వ చరణం
ముదముతో నిర్మానకుండగు-మూలకర్తను బాడరే వదన మీక్షాంబ దేవుని - వందనముతో వేడరే
2వ చరణం
వేధ పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే సాదరముగ దేవునిక మీ - స్వాంతమున బూజింపరే
3వ చరణం
ఎదను విశ్రాంతిన్ బరేశుని - హెచ్చుగా స్తుతి జేయరే సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయనకీయరే
4వ చరణం
చావు పుట్టుక లేని వాడుగా - సతతము జీవించును ఈవులిచ్చుచు తన్ను వేడుమ - హేష్టులను రక్షించును
5వ చరణం
దాసులై దేవునికి నెదలో - దర్బమును పోగొల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము - నే మరక మైదాల్పరే