సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము

seeyoonu paatalu santhoossamuga paaduchu seeyoonu vellludamu

🎵 TG-1242🌐 Telugu
పల్లవి

సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 ||

1వ చరణం

లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 || పొందవలె ఈ లోకంబునందు కొంతకాలమెన్నో శ్రమలు ||సీయోను పాటలు||

2వ చరణం

ఐగుప్తును విడచినట్టు మీరు అరణ్యవాసులై ఈ ధరలో || 2 || నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానునుపై నిల్పుడి ||సీయోను పాటలు||

3వ చరణం

మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి || 2 || నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము ||సీయోను పాటలు||

4వ చరణం

ఐగుప్తు ఆశలన్నియు విడచి రంగుగ యేసుని వెంబడించి || 2 || పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి ||సీయోను పాటలు||

5వ చరణం

ఆనందమయ పరలోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు || 2 || సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభు యేసుకి జై ||సీయోను పాటలు||

Report Error