శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
shaashvatamainadi niivu naayedda chuupina krupa
పల్లవి
అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప
1వ చరణం
నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివి నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో"శాశ్వత"
2వ చరణం
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే"శాశ్వత"
3వ చరణం
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిను వీడదని అభయమిచ్చితివే"శాశ్వత"