శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

shaashvathamainadi neevu naayeda chuupina krupa

🎵 TG-1225🌐 Telugu
పల్లవి

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప

1వ చరణం

నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివి నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో||శాశ్వత||

2వ చరణం

తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే||శాశ్వత||

3వ చరణం

పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిను వీడదని అభయమిచ్చితివే||శాశ్వత||

Report Error