శిలనైన నన్ను శిల్పివై మార్చావు

shilanaina nannu shilpivai maarchaavu

🎵 TG-2009🌐 Telugu
పల్లవి

శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేసావు (2) నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

1వ చరణం

మోడుబారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేసావు నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం వర్ణించలేను లెక్కించలేను ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు నాయెడల నీకున్న తలంపులు విస్తారం నీ కొరకే నేను జీవింతు ఇలలో ఊహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమ మూర్తి నీకే నా వందనం నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం

Report Error