శ్రమలందు నీవు నలిగే సమయమున - ప్రభు నీకు తోడుండుననీ
shramalandu niivu naligee samayamuna - prabhu niiku tooddunddunanii
పల్లవి
యోచించలేదా గమనించలేదా - ఇమ్మానుయేలుండునని"2"
1వ చరణం
శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా? ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? “2" “శ్రమలందు"
2వ చరణం
శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా? ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? “2" "శ్రమలందు”