శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ

shruthicheesi nee paadanaa sthoothra geetham - bhajiyinchi nee paadanaa svaamee

🎵 TG-1226🌐 Telugu
పల్లవి

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ (2) హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా

1వ చరణం

దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా (2) జలప్రళయములో నోవాహును గాచిన బలవంతుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా ||శృతి||

2వ చరణం

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా (2) పాపులకొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా ||శృతి||

Report Error