సీయోను యాత్రికులం సిలువ సైనికులం

siiyoonu yaatrikulan siluva sainikulan

🎵 TG-1264💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

విశ్వాస యోధులం శ్రీయేసు శిష్యులం సిలువను చాటెదం ప్రేమను చూపెదం ప్రభు యేసు కొరకు జీవించెదం హల్లెలూయ జయం మనదే

1వ చరణం

చేతట్టి పాడెదం బాకాలు ఊదెదం ఆత్మతో పోరాడెదం ఆర్బాటం చేసెదం ||సిలువను||

2వ చరణం

ఎరికోను కూల్చెదం ఎడతెగక ప్రార్దించెదం సాతాన్నిఎదిరించెదం జయభేరి మ్రోగించెదం ||సిలువను||

3వ చరణం

దివిటీలు వెలిగించెదం ప్రభు రాకడ చాటెదం సర్వ లోకమునకు సాక్షార్ధమై నిలచెదం ||సిలువను||

Report Error