సిలువ చెంత చేరిన నాడు - కలుషములను కడిగి వేయున్
siluva chentha cheerina naadu - kalussamulanu kadigi veeyun
🎵 TG-1239🌐 Telugu
పల్లవి
సిలువ చెంత చేరిన నాడు - కలుషములను కడిగి వేయున్ పౌలు వలెను సీలా వలెను - సిద్ధాపడిన భక్తులజూచి
1వ చరణం
కొండావంటి బండవంటి - మొండిహృదయం మండుచుండె పండియున్న పాపులనైనా - పిలచుచుండె పరము చేర ||సిలువ||
2వ చరణం
వంద గొర్రెల మందాలొనుండి - ఒకటి తప్పి ఒంటరియాయె తొంబది తొమ్మిది గొర్రెలవిడచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ||
3వ చరణం
తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడచి తరలి పోయె తప్పు తెలసి తిరిగి రాగా - తండ్రి యతని చేర్చుకొనెను ||సిలువ' ||సిలువ చెంత||
4వ చరణం
పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా - పాతాళంభే వారి యంతం ||సిలువ||