సిలువ చెంత చేరిననాడు కలుషములను
siluva chentha cheerinanaadu kalussamulanu
🎵 TG-1997🌐 Telugu
పల్లవి
సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర ||సిలువ||
1వ చరణం
వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల జేర పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతము