ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము Lyrics
పల్లవి
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు ||ఈ సాయంకాలమున||
1వ చరణం
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ ||ఈ సాయంకాలమున||
2వ చరణం
దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు ||ఈ సాయంకాలమున||
3వ చరణం
నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా ||ఈ సాయంకాలమున||
4వ చరణం
జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్ ||ఈ సాయంకాలమున||