స్తుతి మధుర గీతము
sthuthi madhura geethamu
🎵 TG-2845🌐 Telugu
పల్లవి
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము చెల్లించుటే నా ధన్యత బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము చేరడమే నా ఆతృత అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద ||స్తుతి||
1వ చరణం
కనులకే కనపడలేని నా కంటి పాపవై కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2) నాకే తెలియక నాలో నీవు నాదు ప్రాణ శ్వాసవై నడిపించావా దేవా ఇన్నాళ్లుగా అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి రాతి గుండెను దిద్ది గుడిగా మార్చుకున్న దైవమా ముల్లును రెమ్మగా మార్చితివి