స్తుతి పాడుటకే బ్రతికించిన

sthuthi paadutakee brathikinchina

🎵 TG-1685🌐 Telugu
పల్లవి

స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే||

1వ చరణం

ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై

Report Error