స్తుతికి పాత్రుడా సత్య శీలుడా
sthuthiki paathrudaa sathya sheeludaa
🎵 TG-2314🌐 Telugu
పల్లవి
స్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2) నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) ||స్తుతికి పాత్రుడా||
1వ చరణం
ప్రేమధ్వజమును సిలువలో నిలిపి అనంతప్రేమను చూపితివి పాపమునుండి విడిపించి రక్షణవస్త్రం నొసగితివి నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం వర్ణించలేనిది వివరించలేనిది యోగ్యతలేని మాకై నీ పౌరసత్వాన్ని ఇచ్చితివి పరిశుద్దాత్మను మాకొసగి బలవంతులుగా చేసితివి ఎలాగు మరువను ఎలాగు విడువను నీ స్నేహము నీ బంధము