స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
stootrabali stootrabalii manchi deeva niikeenayyaa
పల్లవి
శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
1వ చరణం
నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే -2 నెమ్మది ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా -2 కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
2వ చరణం
రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి -2 మరువని నా స్నేహమా - కలసి సంతోషింతును -2 కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
3వ చరణం
నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి -2 ఉరికురికి పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
4వ చరణం
వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు -2 యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును -2 కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"