స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ - వేలాది వందనాలు
stootramul stuti stootramul - veelaadi vandanaalu
పల్లవి
కల్గుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు - స్తుతి స్తోత్రముల్ యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా (4)
1వ చరణం
శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2) యేసే నా సర్వము - యేసే నా సమస్తము (2) " యేసయ్యా"
2వ చరణం
పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను (2) సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2) " యేసయ్యా"