స్తుతి సింహాసనాసీనుడా - యేసు రాజా దివ్యతేజ
stuti sinhaasanaasiinuddaa - yeesu raajaa divyateeja
1వ చరణం
అద్వితీయుడవు - పరిశుద్ధుడవు - అతి సుందరుడవు నీవె ప్రభు నీతి న్యాయములు నీ - సింహాసనాధారం కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు
2వ చరణం
బలియు అర్పణ కోరవు నీవు- బలియైతివి నా దోషముకై నా హృదయమే నీ - ప్రియమగు ఆలయం స్తుతి యాగమునే చేసెద నిరతం
3వ చరణం
బూరధ్వనులే నింగిలో మ్రోగగ - రాజాధి రాజ నీవే వచ్చువేళ సంసిద్ధతతో - వెలిగే సిద్దితో పెండ్లికుమారుడా నిన్నెదుర్కొందును