స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను

stuti vastramu dharinchi nii sannidhiloo neenu

🎵 TG-1265💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యాజకుని వలె స్తోత్ర బలులు జిహ్వ ఫలములు అర్పింతును

1వ చరణం

రక్షణ పాత్రను చేతబూని నీ స్తోత్రమును ప్రచురింతును ప్రధాన యాజకుడా నీవె మాదిరిగా నీతి వస్త్రముతో సేవ చేసెదను ||స్తుతి||

2వ చరణం

లోకమునకు జ్యోతి వలెనే సత్య సాక్షిగా జీవించనా సత్‌క్రియలను జరిగించి రక్షణ వస్త్రముతో తేజరిల్లెదను ||స్తుతి||

3వ చరణం

సిద్ధ పడిన సంఘ వధువుగ పెండ్లి విందుకు నే చేరనా నూతన యెరుషలేమై పరిశుద్ధ క్రియలతో పెండ్లి వస్త్రముతో వరుని చేరెదను ||స్తుతి||

Report Error