స్తుతులకు పాత్రుడా స్తుతించుచున్నాను నజరేయుడా
stutulaku paatruddaa stutinchuchunnaanu najareeyuddaa
పల్లవి
నా హృదిలో నీ సన్నిధిలో మరువక విడువక స్తుతించుచున్నాను
1వ చరణం
సాగిల పడితిని నీ సన్నిధిలో ఘనుడా నీ కొరకు నీవు నాకై చేసిన మేలుల కొరకై ||స్తుతులకు||
2వ చరణం
నీ సన్నిధిలో నిలచితి నేను నీ సాక్షిగా నీవు పిలచిన పిలుపును ప్రచురము చేయ నిలచితి సాక్షిగా ||స్తుతులకు||
3వ చరణం
పాడుచుంటిని నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో నేను ఆడుచుంటిని ఆనందముతో గంతులు వేయుచు ||స్తుతులకు||
4వ చరణం
భజనలు చేసెద నీ సన్నిధిలో ఘనుడా నీ కొరకు భజయింతును భజయింతును ఘనుడా నీ కొరకు ||స్తుతులకు||