సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా

sundaramaina deehaalennoo shithilam kaaleedaa

🎵 TG-1611🌐 Telugu
పల్లవి

సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా? ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడము (2)       ||సుందరమైన||

1వ చరణం

నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులు సమాధి లోతుల్లోనే మూగబోయారు (2) తపోబలము పొందిన ఋషులందరూ మతాధికారులు మఠాధిపతులు ఈ కాలగర్భంలోనే కలసిపోయారు మరణ పిడికళ్లలో బందీలయ్యారు యేసులేని జీవితం వాడబారిన చరితం క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా? పాప సంకెళ్ళలో బందీలైనవారికి ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు మరో జీవితం లేదనుట భావ్యమా? రక్తము కార్చిన యేసుని విస్మరించి ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? యేసులేని జీవితం అంధకార భందురం క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం

Report Error