తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

tallilaa laalinchunu tanddrilaa preeminchunu

🎵 TG-1066💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా "తల్లిలా"

1వ చరణం

తల్లియైన మరచునేమో - నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో - నిన్ను చెక్కియున్నాను "2" నీ పాదము త్రొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా "తల్లిలా"

2వ చరణం

పర్వతాలు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకృప నీకు - నానిబంధనా తొలగదు "2" దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదుభారమంతా మోసి నాదు శాంతినొసగెదా అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా "తల్లిలా"

Report Error