తార వెలిసింది ఆ నింగిలో

thaara velisindi aa ningiloo

🎵 TG-1396🌐 Telugu
పల్లవి

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2)         ||తార||

1వ చరణం

మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార||

2వ చరణం

బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే

Report Error