తీయని స్వరాలతో నా మనసే

theeyani svaraalathoo naa manasee

🎵 TG-2468🌐 Telugu
పల్లవి

తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను భావమధురిమ ఉప్పొంగెను రాగసుధలతో భాసిల్లెను (2) పరవశించి నిను స్తుతించి ఘనపరచెద వైభవముగా ||తీయని||

1వ చరణం

ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను యేసుతో రాజ్యము చేసే భాగ్యము నాకు దొరికె కనికరము – తనువు పరవశము ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను సహాయుడా నీలోనేగా నా సాఫల్యము యేసుని సన్నిధి చేరే భాగ్యము నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము

Report Error