తొలకరి వాన దీవెనలు కురిపించు
tholakari vaana deevenalu kuripinchu
🎵 TG-2798🌐 Telugu
పల్లవి
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి||
1వ చరణం
ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన||
2వ చరణం
సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును