ఉన్నాడు దేవుడు నాకు తోడు
unnaadu deevudu naaku thoodu
🎵 TG-2209🌐 Telugu
పల్లవి
ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడడెన్నడు ఎడబాయడు (2) కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ||ఉన్నాడు||
1వ చరణం
గాఢాంధకారములో సంచరించినా కన్నీటి లోయలో మునిగి తేలినా కరుణ లేని లోకము కాదన్ననూ కన్నీరు తుడుచును నను కొన్నవాడు యెహోవ సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును బ్రతుకు కాలమంతయు హర్షింతును