ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
uuhinchaleeni kaaryamulu deevudu jariginchinaadu
🎵 TG-1981🌐 Telugu
పల్లవి
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2) దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని||
1వ చరణం
ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం కలవాలి హృదయాలు ఒకటై పండాలి నూరేళ్లు ఇకపై వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ దేవుని సముఖములో బ్రతకాలి మీరు మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో లోబడి ఉండాలి వధువు ప్రేమను పంచాలి వరుడు దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి