వాటి వాటి కాలమున అన్నిటిని
vaati vaati kaalamuna annitini
🎵 TG-1491🌐 Telugu
పల్లవి
వాటి వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా (2) యేసయ్యా.. యేసయ్యా.. నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి||
1వ చరణం
ఆశ భంగం కానేరదు మంచి రోజు ముందున్నది సత్క్రియను ఆరంభించెను ఎటులైన చేసి ముగించును (నే) రూఢిగా నమ్ముచున్నాను (2) ||యేసయ్యా||
2వ చరణం
అద్భుతములు చేసెదను నీ తోడుంటానంటివి నా ప్రజల ఎదుట నీవు (నను) హెచ్చింప చేసెదవు హెచ్చింప చేసెదవు ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసెదవు ఆకాశ తార వలె భువిలో ప్రకాశింతును