వందనాలు యేసు నా వందనాలో
vandanaalu yeesu naa vandanaaloo
🎵 TG-2390🌐 Telugu
పల్లవి
వందనాలు యేసు నా వందనాలో వందనాలు శతకోటి వందనాలు (2) అబ్రాహాము దేవా నా వందనాలు ఇస్సాకు దేవా నా వందనాలు అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా యాకోబు దేవా నా వందనాలు నన్ను పిలిచావు వందనాలో నన్ను కలిసావు వందనాలు నన్ను మరువలేదు వందనాలో నన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు||
1వ చరణం
మహిమనే విడిచావు వందనాలు మహిలోనికి వచ్చావు వందనాలు మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు మార్గమై నిలిచావు వందనాలు మరణమే గెలిచావు వందనాలు మహిమనే చూపావు వందనాలు మరణమే గెలిచావు – మహిమనే చూపావు మాటనే నిలిచావు వందనాలు సిలువనే మోసావు వందనాలు నా బరువునే దించావు వందనాలు సిలువనే మోసి – నా బరువునే దించి నా ఋణమునే తీర్చావు వందనాలు నా తోడు నీవే నా వందనాలు నా నీడ నీవే నా వందనాలు నా తోడు నీవే – నా నీడ నీవే నా వాడవు నీవే నా వందనాలు