వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి

vedakuddi vedakuddi - yehoovaanu vedakuddi

🎵 TG-1220💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

సమయముండగనే – ఆయనను వెదకుడి కృపకాలముననే ఆయనను వెదకుడి (2) "వెదకు"

1వ చరణం

ఆయన మీకు - దొరుకు కాలమున నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా నీపై జాలితో - నిన్ను క్షమియించును -2 తరుణము పోయినా- మరల రాదు -2 "వెదకు"

2వ చరణం

తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును -2 తరుణము పోయినా - మరల రాదు -2 "వెదకు"

3వ చరణం

బాలుడైన యేసుని - జ్ఞానులు వెదికిరి మగ్ధలేని మరియ - యేసుని వెదికెను కన్నీటితో హన్నా - దేవుని వెదికెను -2 తరుణము పోయినా - మరల రాదు -2 "వెదకు"

4వ చరణం

హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే ఎస్తేరు వెదకి - తన వారిన్‌ రక్షించే దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు -2 తరుణము పోయినా - మరల రాదు "వెదకు"

Report Error