విడువను నిను ఎడబాయనని

vidduvanu ninu eddabaayanani

🎵 TG-1267💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నా కభయ మొసంగిన దేవా - నా కభయ మొసంగిన దేవా

1వ చరణం

నేరములెన్నో చేసి చేసి - దారి తప్పి తిరిగితినయ్యా (2) నేరము బాపుము దేవా - నీ దారిని నడుపుము దేవా ||విడువను||

2వ చరణం

పందులు మేపుచు ఆకలి బాధలో - పొట్టును కోరిన నీచుడనయ్యా నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను||

3వ చరణం

మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తోడిగితివయ్యా గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను||

4వ చరణం

సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించేదను ||విడువను||

Report Error