విధేయతకే అర్ధము చెప్పిన వినయ
vidheeyathakee ardhamu cheppina vinaya
🎵 TG-1989🌐 Telugu
పల్లవి
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే||
1వ చరణం
పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2) సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత||
2వ చరణం
పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి రక్షణకు కారకుడవైతివి