విలువైనది సమయము ఓ నేస్తమా

viluvainadi samayamu oo neesthamaa

🎵 TG-2877🌐 Telugu
పల్లవి

విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2) సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము (2)     ||విలువైనది||

1వ చరణం

క్రీస్తుతో మనము లెపబడిన వారమై పైనున్నవాటినే వెదకిన యెడల గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము శోధన మనము సహించిన వారమై క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెదము క్రీస్తుతో మనము సింహాసనముపై పాలించుటకై జయమొందుటకు సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెదము

Report Error