యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

yeesayya naamanloo shakthi unnadayyaa

🎵 TG-2737🌐 Telugu
పల్లవి

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)        ||యేసయ్య||

1వ చరణం

పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం

Report Error