యేసయ్య పాదాలు బంగారు పాదాలు
yeesayya paadaalu bangaaru paadaalu
🎵 TG-1558🌐 Telugu
పల్లవి
యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2) ఎండల్లో కందాయయ్యా అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య||
1వ చరణం
మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా నడలేక తూలాడయ్యా అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా కొయ్యపై కాళ్ళు పెట్టి సీలను కొట్టిరయ్యా పాదాలు అదిరాయయ్యా అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే పాపాలు పోతాయయ్యా అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య||
2వ చరణం
రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చేందుకు వచ్చాడయ్యా ప్రాణము పెట్టాడయ్యా