యేసయ్యా నా హృదయ స్పందన

yeesayyaa naa hrudaya spandana

🎵 TG-2402🌐 Telugu
పల్లవి

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)         ||యేసయ్యా||

1వ చరణం

నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||

2వ చరణం

నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే

Report Error