యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా
yeesayyaa naa hrudaya spandana neeve kadaa
🎵 TG-1280🌐 Telugu
పల్లవి
యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా విశ్వమంతా నీ నామము ఘననీయము
1వ చరణం
నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగ మారెనే నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
2వ చరణం
నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
3వ చరణం
నీవు వరునిగ విచ్చేయువేళ నా తలపుల పంట పండునే వధువునై నేను నిను చేరగ యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||