యేసయ్యా నా ప్రాణనాథా నిను

yeesayyaa naa praannanaathaa ninu

🎵 TG-2154🌐 Telugu
పల్లవి

యేసయ్యా నా ప్రాణనాథా నిను ఆడి పాడి కీర్తించెదను నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను ||యేసయ్యా||

1వ చరణం

సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వలోకమును సృష్టించిన సుందరుడా (2) స్తుతి మహిమా ఘనతా నీకే అని సంతసించి స్తోత్రించెదను పాపమే ఎరుగని నీతిమంతుడా పాపిని రక్షించిన నీతిసూర్యుడా పరిశుద్ధ పరలోక తండ్రి అని పరవశించి నే పాడెదను ఆది అంతమైన అల్ఫా ఒమేగా మేఘముపై రానున్న మహిమోన్నతుడా ఉన్నవాడవు అనువాడవు నీవని ఉల్లసించి ఆరాధింతును

Report Error