యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ
yeesayyaa naa yeesayyaa epuddayyaa nii raakadda
పల్లవి
యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
1వ చరణం
చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము||
2వ చరణం
నా రూపమే మారునంట నిన్ను చూచువేళ నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము||
3వ చరణం
అమూల్యమైన రత్నములతో అలంకరించబడి - గొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న- అంధకారమే లేని ఆ దివ్యనగరమందు అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను ||రమ్ము||