(యేసయ్యా) సదాకాలము – నీ
(yeesayyaa) sadaakaalamu – nee
🎵 TG-2859🌐 Telugu
పల్లవి
(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి నిలుపుచున్నాను (2) అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతియింతును ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా (2) ||సదాకాలము||
1వ చరణం
చుక్కాని లేని నావనై సంద్రాన నే చిక్కుబడగా నా దరి చేరి – ఈ ధరలోన నీ దరి నడిపించావే (2) ||ఆరాధనా||
2వ చరణం
అన్య జనులు ఏకమై నిందలు నాపైన మోపినా నిందలు బాపి – నన్నాదుకొని విడువని కృప చూపినావే నాశనకరమైన ఊభిలో నేను పది కృంగగా హస్తము చాచి – నను ఆదుకొని (నీ) ఆత్మతో బలపరచినావే