యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి

yeesayyaa yeesayyaa… needentha jaali

🎵 TG-1631🌐 Telugu
పల్లవి

యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా||

1వ చరణం

ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం అయ్యో.. ఆరిపోవు దీపం అయినా రాదు నీకు కోపం గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి జారే కన్నీళ్లు మాత్రం పాపం చేసినోల్ల కోసం నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం నిను మోసి కట్టుకుంది పుణ్యం ఆహా సిలువదెంత భాగ్యం ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే చూసిన వారి జన్మ ధన్యం

Report Error