యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు

yeesu andariki prabhuvu.... yeesee.... lookarakssakuddu

🎵 TG-1190💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే "యేసు"

1వ చరణం

అల్ఫా ఓ మేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే అన్ని కాలంబులలో నున్నవాడు - కన్నతండ్రి మనకు ఆ ప్రభువే "యేసు"

2వ చరణం

దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె పాపాత్ములమైన మనకొరకే - ఆ సిలువలో ప్రభువు మరణించె "యేసు"

3వ చరణం

పాపులు ప్రభుని వేడినా - కలుషాత్ములు ప్రభు క్షమకోరినా క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి "యేసు"

4వ చరణం

రమ్ము ఓ సోదరా నేడే - ఇమ్ము నీ హృదయ మీనాడే నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె

Report Error