యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే
yeesu koosamee jeeviddaam yeesuthoonee
🎵 TG-2607🌐 Telugu
పల్లవి
యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం లోకములో యేసుని ప్రతినిధులం శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా ||యేసు కోసమే||
1వ చరణం
నిందారహితులుగా జీవించుట మన పిలుపు నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము యేసు స్వభామును ధరించిన వారలము మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము రాజులు జనములు యేసుని చూచెదరు విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు