యేసు మంచి దేవుడు
yeesu manchi deevudu
🎵 TG-2017🌐 Telugu
పల్లవి
యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2) ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి||
1వ చరణం
శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు శాంతి సమాధానం మనకిచ్చాడు సమతా మమత నేర్పించాడు మార్గము సత్యము జీవమైనాడు మానవాళికే ప్రాణమైనాడు