యేసు నీకే జయం జయము

yeesu neekee jayam jayamu

🎵 TG-2446🌐 Telugu
పల్లవి

యేసు నీకే జయం జయము (2) నీవే లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు జై జై అనుచు నీకే పాడెదం జన్మించె జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె పాపియైన మాన-వుని రక్షింప సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ హల్లెలూయా భువిపైన (2)        ||యేసు||

1వ చరణం

మరణము ద్వారా – అంతమాయె బలులు తన సమాధి సర్వం కప్పెన్ తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్ తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్ రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందె అధికారము – పరలోకముపై తన రూపమునకు మార్పు నిష్ట-మాయె సృష్టికంటె ముందు తానే సంకల్పించె లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని తన రూపము నొంది – తనతో నుండెదం

Report Error